Ram Charan: క్యాంపా కోలా బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ స్టార్ 4 d ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "పెద్ది" లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, షూటింగ్ జోరుగా సాగుతుంది. కాగా, ఈ చిత్రం మార్చి 26, 2026న విడుదల కానుంది. ఇదిలా ఉండగా, రామ్ చరణ్ "క్యాంపా కోలా" యాడ్‌లో మెరిశారు. ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా రీలయన్స్ సంస్థ ప్రకటించింది. ఆ యాడ్ వీడియో సామజిక మాధ్యమంలో వైరల్ అవ్వగా, హాలీవుడ్ స్టైల్ లో ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.